మహేష్ బాబు-పూరీ కాంబోలో జనగణమన.. బాలయ్య సినిమా ముగిశాక..?

బుధవారం, 29 మార్చి 2017 (10:19 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్ అంటున్నారు. మహేష్‌తో ఆ సినిమా పట్టాలెక్కడం జరిగితే అది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా తీస్తానని పూరీ జగన్నాథ్ చెప్తున్నాడు. 
 
గతంలో మహేష్ పూరీ జగన్నాథ్ కాంబో వచ్చిన పోకిరి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్ధలు కొట్టిన ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్‌మెన్ సినిమా తీశారు. ఈ సినిమా కూడా అంచనాలను అందుకుంది. 
 
ఇక మరోసారి ఇద్దరు కలిసి జనగణమన టైటిల్ తో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అది సెట్స్ మీద ఉండగా ఇషాన్ హీరోగా వస్తున్న రోగ్ మార్చి 31న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా పూర్తయిన తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి