రాధిక ఆప్టేకు సంబంధించిన రియల్ న్యూడ్ వీడియో క్లిప్ ఒకటి నెట్లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె తన రహస్య అంగాలను ప్రదర్శిస్తూ ఉన్న సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్లా వ్యాపించింది. ఈ న్యూడ్ వీడియో క్లిప్ గురించి ఆమె లైట్ తీసుకుంది. చూస్తే చూడండి నాకేటి సిగ్గు అన్నచందంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది. గతంలోనూ రాధిక ఆప్టే పేరుతో కొన్ని నగ్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసాయి. అయితే అవి తనవి కాదని, తన ఫేసును మార్పింగ్ చేసి ఎవరో ఫేక్ ఫోటోలు సృష్టించారని వివరణ ఇచ్చింది.
అయితే రాధిక ఆప్టే మాత్రం ఈ న్యూడ్ వీడియో వివాదాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నేను చాలా బిజీ.... ఇలాంటి పట్టించుకునే తీరిక లేదు. అసలు తను న్యూడ్‌గా నటించినా తన భర్త కూడా తనను ఏమీ అనడని అంటోందట. అలాంటిది కొందరు పనిలేని వారు కావాలని క్రియేట్ చేస్తున్న ఇలాంటి వివాదాల వల్ల నేను గానీ, నా ప్యామిలీగానీ ఎలాంటి ప్రభావానికి గురి కాబోమని తెగేసి చెప్పింది రాధికా ఆప్టే. అయితే అలాంటి సీన్లలో నటించిన రాధిక ఆప్టేను బాలీవుడ్లో అందరూ.... బ్రేవ్ గర్ల్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయిగా మెచ్చుకుంటున్నారు.
తాజాగా ఇంగ్లిష్ సినీ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా కొన్ని సంచలన వాఖ్యలు చేసింది. నటిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో తాను కూడా అందర్లాగే ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. తమతో పడుకొని పడక సుఖం అందిస్తేనే నీకు హీరోయిన్‌గా చాన్స్ ఇస్తామని డైరెక్ట్‌గానే చెప్పారట కొంతమంది దర్శక నిర్మాతలు. అయితే తను అటువంటి వాళ్ళకు లొంగేది లేదని, పైగా అటువంటి సినిమాలు అవసరం లేదని అందుకే కొన్ని సినిమాలు కూడా వదులుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తానెప్పుడూ అడ్డదారులు తొక్కలేదని తెలిపింది.
'ఓసారి ఓ నటుడు... దక్షిణాదికి చెందిన హీరో ఫోన్ చేసి తన గదికి రమ్మని పిలిచాడు. అంతటితో ఆగకుండా తన హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడాడు. అంతే ఒక్కసారి కోపం తలకెక్కింది. వెంటనే అతని చెవులు వాచిపోయేలా దుమ్ముదులిపేశా' అని రాధికా ఆప్టే తెలిపింది. అయితే, ఆమె ఆ నటుడి పేరు చెప్పకపోవడం విశేషం.