పవన్ కోసం ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

సెల్వి

శనివారం, 16 నవంబరు 2024 (22:28 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో కాకరేపుతున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలో పవన్ రోడ్ షో చేస్తే.. ఎంత జనం వస్తుందో.. అంతకంటే ఒకందుకు ఎక్కువే మహారాష్ట్రలో పవన్‌ కోసం రోడ్డుపైకి వచ్చారు జనం. పవన్ కోసం భారీ జనం ఆయన పాల్గొన్న ప్రచార సభల వద్ద, రోడ్లపై కనిపించారు. ఆయన నటించిన సినిమాలను చూశామని, పాటలంటే ఇష్టమని మహారాష్ట్ర ప్రజలే చెప్పారు. 
 

Pawan Kalyan garu will campaign for BJP candidates in Maharashtra on 17th and 18th November.

It will be huge ???? pic.twitter.com/sKiW5OQMtw

— Sara Tendulkar ( Parody ) (@saratendulkerr) November 15, 2024
అలాగే అక్కడ నివసించే పవన్ ఫ్యాన్స్ ఆయన పట్ల అభిమానం కోసం రోడ్లపై భారీగా చేరుకున్నారు. ప్రచార సభలు జరిగే ప్రాంతంలో గుమికూడారు. ఇలా పవన్ ఫ్యాన్స్ మహారాష్ట్ర చేసిన హంగామాకు సంబంధించిన బోలెడు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇప్పటికే డెగ్లూరులో, లాతుర్‌లో ప్రసంగించారు. అయితే.. పవన్ నాందేడ్‌లో ప్రసగించినప్పుడు మరాఠీలో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను, ఆయన తల్లి జిజియా బాయిని గుర్తు చేసుకున్నారు. 
Pawan kalyan
 
అదే విధంగా బాబా సాహేబ్ అంబేద్కర్, బాల్ థాకరే గారిని స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అక్కడి వాళ్లలాగా పగిడిసైతం వేసుకున్నారు. ఇక్కడ హైలేట్ ఏంటంటే.. అనేక చోట్ల పవన్ ఛత్రపతి శివాజీ మహారాజ్‌లా అనేక ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో పవన్ మెనియా.. సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్లీ ట్రెండింగ్‌లో నిలిచారు. 
 
ఇకపోతే.. నవంబర్ 17న చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ సభలో, అదేరోజు సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరధిలో జరిగే రోడ్ షోలో పవన్ పాల్గొంటారు. మొత్తమ్మీద పవన్ 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొననున్నారని సమాచారం.

బాబోయ్ ఏమిటి ఆ జనం ???? ఆంధ్ర అయినా మహారాష్ట్ర అయినా Kalyan గారి craze ఏ వేరబ్బా ????????????????
ఎవరికి అంతుచిక్కని Aura ఉంటుంది ఆయనలో ???????? అందుకే ఆయన follower అయినందుకు ఎప్పుడూ గర్వపడుతుంటాను ????❤️#PawanKalyanForMaharashtrapic.twitter.com/UP5hbIV1gu

— Sailu (@Sailu_JSP) November 16, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు