నటిగా తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఖాళీ దొరికితే సముద్ర బీచ్‌కు వెళుతోంది. తాజాగా ఓ బీచ్‌లో తన అందాలని ఇలా ఆరబోసింది. ఉదయం యోగ, వ్యాయామం తర్వాత స్విమ్మింగ్ తప్పనిసరిగా చేసే రకుల్ వీలుచిక్కిన బీచ్‌కు వెళ్ళడం తనకు ఇష్టమని పేర్కొంటోంది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాల్లో నటించిన రకుల్ `కొండపొలం` సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసింది. తాజాగా ఇప్పుడు ఆమెకు అవకాశాలు తెలుగులో తగ్గాయి. కొత్తతరం వచ్చేసింది.