ఇప్పుడే కొండపొలం సినిమా చూశాను. అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఓ అందమైన, రస్టిక్ ప్రేమ కథను చూపించారు. నేను ఎప్పుడూ కూడా క్రిష్ పనితనాన్ని ప్రేమిస్తుంటాను. విభిన్న జానర్లను ఎంచుకోవడం, సమాజంలోని సమస్యలను తీసుకోవడం, ఆర్టిస్ట్ల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం క్రిష్లోని ప్రత్యేకత. ఈ సినిమా భవిష్యత్తులో అవార్డులను, రివార్డులను సాధిస్తుందనే గట్టి నమ్మకం ఉంది అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.