తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పైన తీవ్రస్థాయిలో నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం మానుకోండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఒక కార్యక్రమంలో శ్రీరెడ్డిని ఉద్దేశించి చెప్పింది. దీంతో శ్రీరెడ్డి మరింత రెచ్చిపోయింది. నువ్వు ఎంతమందితో డేట్ చేశావో.. నాకు బాగా తెలుసు. అనవసరంగా నన్ను విమర్శించకు. ఏదో పెద్ద తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావే. నేను పడే కష్టం నాకు తెలుసు. నీకేమైనా తెలుసా అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి.
రకుల్ పైన ఆరోపణలు చేసి ఆ తరువాత ఫిలిం ఛాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శన చేసింది శ్రీరెడ్డి. ఆ తరువాత కూడా వెనక్కి తగ్గలేదు. ప్రతిచోటా రకుల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చింది. ఇది కాస్త రకుల్‌ను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి నెట్టింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ వెనక్కి తగ్గింది. శ్రీరెడ్డి గురించి మాట్లాడటం అస్సలు మానేసింది.