అయితే, ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విరాట్ కోహ్లీ బయోపిక్ రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో రామ్ చరణ్ తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని, అతని బయోపిక్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించారు.
అయితే కోహ్లీ బయోపిక్ రైట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు. ధోనీ తన బయోపిక్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్మేశాడు. విరాట్ కోహ్లీ ఒక్కో సోషల్ మీడియా పోస్ట్‌కు రూ.8 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ధోనీతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీ క్రేజ్ ఎక్కువ. అందుకే విరాట్ కోహ్లీ తన బయోపిక్ రైట్స్ కోసం రూ.800 నుంచి రూ.1000 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
విరాట్ కోహ్లి ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌ను క్లైమాక్స్‌గా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. మరోవైపు, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించే గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నాడు.