ఈ సినిమా ఓనం రోజున థియేటర్లలోకి రానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్‌ను నిర్వహించారు. దీనికి నటులు నాని, రానా దగ్గుబాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. 'నటుడు దుల్కర్ సల్మాన్ ఓ ప్రముఖ హిందీ చిత్రంలో నటిస్తుండగా.. బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ ఒకరు షూట్ మధ్యలో తన భర్తతో కలిసి ఫోన్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు.
షాపింగ్ వ్యవహారంలో ఆమెను ఆమే మరిచిపోయారు. లండన్‌లో భర్త షాపింగ్ చేస్తుంటే.. ఆమె అతనితో మాట్లాడుతూ.. సీన్ టేకులు తీసుకుంటూ.. ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీన్ని దుల్కర్ చాలా ఓపిగ్గా చూస్తుండిపోయాడు. అంటూ సోనమ్ కపూర్‌ను ఉద్దేశించి రానా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రానా ప్రస్తుతం స్పందించాడు. తన వ్యాఖ్యలు తప్పే బాబోయ్ అంటూ చెప్పాడు. నెగటివిటీని తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు.
ఇంకా రానా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో, "సోనమ్ కపూర్ గురించి నేను చెప్పింది పూర్తిగా అబద్ధం. స్నేహితులుగా, మేము తరచుగా సరదాగా సరదాగా మాట్లాడుకుంటాము.
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా చింతిస్తున్నాను. సోనమ్, దుల్కర్ ఇద్దరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ పోస్ట్ పెడతారని ఆశిస్తున్నాను. అపార్థానికి ఇలా ముగింపు చెప్తున్నాను" అని అన్నారు.