రష్మిక ఆ మాట అన్నదట.. అదేమిటో తెలిస్తే షాకే..

శనివారం, 10 ఆగస్టు 2019 (20:48 IST)
తెలుగు సినీపరిశ్రమలో బాగా రైజ్ అవుతోంది రష్మిక. తెలుగులో ఆమె నటించిన ఛలో, గీత గోవిందంలు సూపర్ హిట్. ఇప్పుడు మహేష్ బాబుతో నటిస్తోంది. ఇలా దూసుకుపోతున్న రష్మికకు ఒక కోరిక ఉందట. 
 
సౌత్ ఇండియన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ లక్కీ గర్ల్ ఎవరని అంటే ఠక్కున సమాధానం చెబుతారు రష్మిక మందన అని. డజన్ సినిమాలైనా లేని ఆమె కెరియర్లో మంచి మంచి హిట్లు ఉన్నాయి. తెలుగులో అడుగు పెట్టడంతోనే ఛలో సినిమాతో సక్సెస్ కొట్టింది. వెంటనే గీత గోవిందం కూడా హిట్టయ్యింది. 
 
గీత గోవిందం హిట్ అవ్వడంతో అదే కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ వచ్చింది. అందరిలాగా కాకుండా చిన్న సైజు అందాల దేవత అంటూ రష్మికపై మంచి కామెంట్లు వచ్చాయి. దానికి తగ్గట్లే రష్మిక నటన కూడా ఉంది. ప్రస్తుతానికి సౌత్ ఇండియా గ్లామర్ హీరోయిన్లలో లక్కీ రష్మిక ఒక్కటే అన్న ప్రచారం బాగానే ఉంది. ఆమెకు వద్దన్నా ఛాన్సులొస్తున్నాయి. 
 
ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేస్తుండగా, బన్నీతో కూడా ఒక సినిమాను ఆమె ఒప్పుకుంది. ఇదంతా పక్కన బెడితే తమిళనాడులో అభిమానులు ఖుష్బు, నమితలకు గుడి కట్టేశారు. తనకు కూడా అభిమానులు అలాగే గుడి కడతారేమో అని అంటోందట రష్మిక. 
 
కనీసం నాలుగు సంవత్సరాల సినీ కెరీర్ కూడా సరిగ్గా లేని రష్మిక అలా అనడం తెలుగు చిత్రసీమలోనే కాదు అటు తమిళ సినీపరిశ్రమలోనే చర్చ బాగానే జరుగుతోంది. అయితే తన మనస్సులోని మాట చెప్పానని, ఇందులో తప్పేమి ఉందంటోది రష్మిక. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు