తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య- అశ్విన్ విడాకులకు కారణం ఏమిటనే కోలీవుడ్‌లో చర్చసాగుతోంది. ఇటీవలే తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సౌందర్య రజనీకాంత్.. అశ్విన్ నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. గత రెండేళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట విడిపోయేందుకు ప్రధాన శత్రువు కోపమేనని కోలీవుడ్ జనం మాట్లాడుకుంటున్నారు.
అలాగే వివాహానికి అనంతరం అశ్విన్ కుటుంబీకుల వద్ద కూడా సౌందర్య అదే రీతిన ప్రవర్తించడంతో అశ్విన్ ఆమెను వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సౌందర్య కోపంతో జరిగిన పరిణామాలపై అశ్విన్ మామగారైన రజనీకాంత్ చెప్పారని.. ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాకే సౌందర్య-అశ్విన్‌ల వివాహ జీవితానికి విడాకుల ద్వారా బ్రేక్ పడిందని కోలీవుడ్ సినీ పండితులు అంటున్నారు.