వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ఆఫీసర్. ఈ సినిమా ఎంతటి పరాజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజైన మూడు రోజులకే థియేటర్స్ నుంచి తీసేసారంటే.. సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది అటు నాగ్ ఇటు వర్మ ఇద్దరికీ గట్టి షాకే. అయితే... వర్మ ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే... బాగా అప్పుల్లో ఉన్నాడట.
నాగార్జునతో సినిమా చేస్తే... క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అప్పులు అన్నీ తీరుపోతాయ్ అనుకున్నాడట. తను ఒకటి తలిస్తే... దేవుడు మరొకటి తలిచాడట. అలా...వుంది వర్మ ప్రస్తుత పరిస్థితి. అప్పులు నుంచి బయట పడచ్చు అని నాగార్జునతో సినిమా చేస్తే.... అప్పులు తీరకపోగా.. ఈ సినిమా వల్ల కొత్త అప్పులు వచ్చిపడ్డాయట. దీంతో వర్మకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందట.