మూడు నెలల పాటు ప్రతిరోజు అదే పనిచేశానన్న రీతూవర్మ..! (Video)

సోమవారం, 22 జూన్ 2020 (15:38 IST)
అచ్చతెలుగు అమ్మాయి రీతూవర్మ కరోనా సమయంలో మూడు నెలల పాటు చాలా ఇబ్బందులు పడిందట. ఎప్పుడూ షూటింగ్ లో బిజీగా ఉండేదాన్ని.. షూటింగ్ లేకపోవడంతో నాకు అస్సలు నిద్రపట్టలేదు. మూడునెలల పాటు చాలా ఇబ్బంది పడ్డా. రోజులు గడపడం నాకు నరకప్రాయంగా మారిందంటోంది రీతూవర్మ.
 
అభిమానులతో ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న రీతూవర్మ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. షూటింగ్‌లో ఉంటేనే నేను ఏదో చేస్తున్నానని అనిపిస్తుంది. ఇంట్లో కూర్చుంటే మాత్రం అస్సలు ఇష్టముండదు. మొదట్లో అందరి పేరెంట్స్ లాగే నా తల్లిదండ్రులు కూడా సినిమాలు నీకు అవసరమా అన్నారు.
 
ఎందుకంటే మా ఇంట్లో ఎవరూ సినీరంగంలో లేరు కాబట్టి. కానీ నేను కొన్ని సినిమాల్లో నటించడం.. ఆ సినిమాలు మా వాళ్ళకి నచ్చడంతో ఇక నన్ను ఫ్రీగా వదిలేశారు. గుడ్ రీతూ అంటుంటారు మా అమ్మ, నాన్న. అయితే కరోనా సమయంలో మాత్రం చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెయింటింగ్‌లు వేయడం.. గేమ్స్ ఆడటం లాంటివి ఎలా చేశానో.. అదే చేశానంటోంది రీతూ. అయితే ఈ గ్యాప్‌లో కాస్త బొద్దుగా మారానని అభిమానులతో చాటింగ్ చేస్తూ తన మనస్సుల్లోని మాటలను బయట పెట్టింది రీతూవర్మ. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు