96 మూవీ రీమేక్.. సమంత, శర్వానంద్.. రొమాన్స్ ఏమాత్రం వుండదట..!

శనివారం, 15 డిశెంబరు 2018 (10:45 IST)
''త్రిష'' హీరోయిన్‌గా నటించి తమిళంలో రిలీజైన.. 96 మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నటించేందుకు సమంత ఒప్పుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. 
 
ఈ సినిమాలో నటించనున్నట్లు కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించినా.. చివరికి సమంతను ఎంపిక చేశారు. హీరోగా శర్వానంద్‌ను తీసుకోనున్నారని టాక్ వస్తోంది. ఈ సినిమా ప్రేమకథా చిత్రమైనా హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఏమాత్రం వుండదని.. అంతగా నటనకు ఫీలింగ్స్‌కు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సినిమా అని టాక్ వస్తోంది. అందుకే ఈ సినిమాలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక 96 తెలుగు రీమేక్‌లో దర్శకుడు ఎవరో ఇంకా తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు