అక్కినేని కుటుంబంనుంచి విడిపోయినా వారి సభ్యులతో ఏదోవిధంగా పాలుపంచుకుంటోంది సమంత. సమంత, నాగచైతన్య టాలీవుడ్లో బెస్ట్ కపుల్ అన్న నానుడికి తిరగరాయడం జరిగింది. ఇటీవలే తన ఇన్స్ట్రాలో పేరునుకూడా మార్చిన సమంత ఆ తర్వాత ఫాలోవర్‌గా చైతన్య పేరుకూడా తీసేసింది. కానీ అఖిల్ పేరును అలా వుంచింది. ఈ శుక్రవారం అఖిల్ పుట్టినరోజు ఒకవైపు అఖిల్, నాగ చైతన్య ఇద్దరూ పబ్‌లో ఎంజాయ్ చేస్తూ వున్న ఫొటోను నాగచైతన్య సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. తన భుజంపై ఎక్కించుకుని మరీ పబ్‌లో డాన్స్ వేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ఎప్పటికీ చాలా ప్రేమ వున్నంటే.. అంటూ పోస్ట్ చేశాడు.