టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కానున్నారు. వీరిద్దరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, పెళ్లి ముహుర్తం ఇంకా ఖరారు కాలేదు. వచ్చే యేడాది జరుగుతుందని చెపుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం చైతూ - సమంతల పెళ్లి తేదీపై ఓ వార్త ఓ వైరల్‌గా మారింది.
ఎంగేజ్‌మెట్ పూర్తి చేసుకున్న ఈ యువజంట వివాహానికి ముహూర్తం ఖరారైందని, అక్టోబర్ 6న వివాహంతో వీరిద్దరూ దంపతులు కానున్నారని వార్త వైరల్ అవుతుండగా, దీనిపై అధికారికంగా ఆ నటీనటులిద్దరూ స్పందించలేదు. కాగా, 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ, తమ వివాహం అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఉంటుందని తెలిపాడు. డేట్ ఇంకా అనుకోలేదని సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెల్సిందే.