తాజాగా, సమంత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హీరో నితిన్ ఒక చిన్న చైర్‌లో కూర్చుని ఉన్నారు. అప్పుడు.. సామ్..ఆ చైర్‌ను ముందుకు నెట్టుతూ.. క్యూట్ పవర్ స్టార్ లవ్ యూ.. అంటూ క్యూట్‌గా ప్రపోజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సమంత, నితిన్ కలిసి నటించిన అ..ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు తెలుస్తోంది. వీడియోలో, హీరో నితిన్ ఓ చిన్న చైర్‌పై కూర్చొని ఉండగా, సమంత ఆ కుర్చీని ఊపుతూ..లిటిల్ పవర్ స్టార్, లవ్ యూ అని ప్రపోజ్ చేశారు. అయితే అందులో లవ్ యూ అని సమంత అనలేదు. వి లవ్ యూ అందనే విషయాన్ని గుర్తించాలని కామెంట్లు చేస్తున్నారు.