ఔను... నేను తేడా అంటున్న షాలిని పాండే

సోమవారం, 4 డిశెంబరు 2017 (18:49 IST)
నాకు ప్రేమ గురించి తెలియదు. ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్‌లాక్ కిస్‌లు ఇచ్చేటప్పుడు నాకు అర్జున్ రెడ్డి కనిపించలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే నాకు గుర్తుంది. అంతకు ముందెప్పుడు అలాంటి కిస్‌లు నేను ఇవ్వలేదు అని చెబుతోంది షాలిని పాండే. ప్రస్తుతం నేను 100 పర్సెంట్ లవ్ తమిళ సినిమాలో నటిస్తున్నాను. అందుకే సన్నగా అయ్యాను. గతంలో కంటే ఇప్పుడు స్లిమ్‌గా ఉన్నాను. 
 
నావరకు వస్తే నేను ఖచ్చితంగా తేడానే. నేను అందరిలా కాదు. నా రూటు పూర్తిగా సెపరేటు అంటోంది షాలిని పాండే. నాకు డబ్బు అవసరం. అందుకే డబ్బు ఎవరైతే ఎక్కువ ఇస్తారో ఆ సినిమాలో నా అందాలను ఆరబోయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. బికినీ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నిర్మాత ఇచ్చే రెమ్యునరేషన్‌ను బట్టి అది ఆధారపడి ఉంటుంది అని చెప్పింది షాలిని. ఒక్క సినిమాకే బికినీకి షాలిని సిద్ధమవ్వడం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు