లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ ఇప్పటికే సినిమాల్లోకి వచ్చి టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. దక్షిణాదిలో బిజీ హీరోయిన్ ఎవరంటే కూడా ఠక్కున గుర్తొచ్చే పేరు శృతిహాసన్. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో చిందులేసి అందరిని ఆకట్టుకుంటోంది. కాగా ఈ హీరోయిన్ ఓ యువ హీరో సినిమా కోసం స్పెషల్ సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా మహదేవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జాగ్వార్'. తెలుగు, కన్నడంలో రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్‌తో డాన్స్ చేయించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ పాటకోసం శృతికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కుడా ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వేచియుండాల్సిందే.