3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

ఐవీఆర్

శుక్రవారం, 27 డిశెంబరు 2024 (16:54 IST)
ధనుష్, శ్రుతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన 3 చిత్రం అందరికీ గుర్తుండే వుంటుంది. ఈ చిత్రంలో నటించక మునుపు శ్రుతి హాసన్ కెరీర్ 3 పువ్వులు 6 కాయల్లా వుండేది. ఐతే ఎప్పుడైతే 3 చిత్రంలో నటించిందో ఇక అప్పట్నుంచి ఆమె కెరీర్ నత్త నడక కంటే మరీ నెమ్మదిగా సాగింది. ఆమెకి ఆఫర్లు ఇస్తామంటూ వచ్చినవారి కోసం చుక్కానిలో చూడాల్సి వచ్చిందని స్వయంగా శ్రుతి హాసన్ చెపుతూ బేలగా ముఖం పెట్టింది.
 
ఐతే 2024లో కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్లు ఆఫర్లు వచ్చాయంట. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ చిత్రం కూలీలో నటిస్తోంది. ఇంకా సలార్ శౌర్యాంగపర్వం చిత్రంలో నటిస్తోంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డకాయిట్ చిత్రంలో శ్రుతి హాసన్‌కి ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ తర్వాత ఆమెను తొలగించారు. ఇది కూడా 3 దెబ్బేననే సందేహంలో శ్రుతి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు