'బీరువా' అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి సురభి. ఈ చిత్రంలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. 2013లో ఓ తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు 'బీరువా' అనే చిత్రం ద్వారా పరిచయమైంది. సురభికి మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది.
టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలను బాగానే ఆకట్టుకుంది. దాంతో ఇక్కడ 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఎటాక్', 'జెంటిల్‌మాన్' వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో కూడా సురభికి మంచి గుర్తింపు దక్కింది. కానీ వరసగా అవకాశాలు మాత్రం దక్కించుకోవడంలో బాగా వెనకబడింది. 2019లో 'ఓటర్ అన్న' సినిమా తర్వాత రీసెంట్‌గా 'శశి' అన్న సినిమాలో నటించింది.