దక్షిణాది హీరోయిన్లలో అగ్రస్థానం సంపాదించుకున్న త్రిష.. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం వరకు వెళ్ళింది. ఆపై పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది. చనిపోయేంతవరకు నటిస్తునూ ఉంటానని.. హీరోయిన్ వేషాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా కొనసాగుతూనే ఉంటానని.. ఇందుకు వరుణ్ మణియన్ ఒప్పుకోకపోవడంతోనే ఆ వ్యక్తితో తెగతెంపులు చేసుకున్నట్లు త్రిష ఓ కొడి ప్రమోషన్ కార్యక్రమంలో తెలిపింది.
టాలీవుడ్, కోలీవుడ్‌లలో నెంబర్ హీరోయిన్‌గా.. దాదాపు దశాబ్ధ కాలం పాటు కొనసాగిన త్రిష.. పెళ్ళి చేసుకోవడం ద్వారా సినీ పరిశ్రమకు దూరమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ త్రిష మాత్రం పెళ్ళిని పక్కనబెట్టి... లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హీరోయిన్ అవకాశాలను కూడా చేసుకుంటూపోతోంది.