మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్ధాయి కలెక్షన్స్‌తో సైరా నరసింహారెడ్డి సినిమా సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే.. కొరటాల శివతో చిరు తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమా ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.