అవును.. వైరముత్తు తక్కువేం కాదు.. చిన్మయి (video)

మంగళవారం, 9 అక్టోబరు 2018 (13:01 IST)
దేశంలో మీ టూ విప్లవం ఊపందుకుంది. లైంగిక వేధింపులకు గురైన సెలెబ్రిటీలు మీ టూలో భాగంగా చేదు అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు, గాయకులు, రచయితలు తమకు ఎదురైన ఘటనలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో గాయని చిన్మయి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత వైరముత్తు తమను లైంగికంగా వేధించాడని కొందరు ఆరోపించారు. ఏడు జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న వైరముత్తు.. వద్ద పనిచేసిన 18 ఏళ్ల గాయనితో అతడు అభ్యంతరకరంగా ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయి. వైరముత్తు కారణంగా ఎందరో ఇబ్బంది పడ్డారని.. కానీ అతడిని ఎదిరించి మాట్లాడలేరని ఆ యువతి వాపోయింది. 
 
తనకున్న పరిచయాలతో బాధితుల నోళ్లు మూయిస్తున్నాడని సదరు గాయని జర్నలిస్ట్ సంధ్యామీనన్‌కి మెసేజ్ చేయగా ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన సింగర్ చిన్మయి.. తన స్నేహితురాలు కూడా వైరముత్తు కారణంగా ఇబ్బంది పడిందని స్పష్టం చేసింది. ఈ విషయం చెప్పినప్పుడు వణికిపోయానని చిన్మయి ట్వీచ్ చేసింది. 
 
బాధితులు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడటం లేదని చిన్మయి తేల్చేసింది. కాగా, గతంలో గోదాదేవిగా పిలువబడే ఆండాళ్‌ను దేవదాసి అంటూ వ్యాఖ్యానించి వైరముత్తు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లైంగిక వేధింపుల వివాదంలో ఆయన చిక్కుకున్నాడు. ఈ ఆరోపణలపై వైరముత్తు ఏమంటారో వేచి చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు