'ఇష్కియా-3'లో విద్యాబాలన్.. సెక్సీ పాత్రలో బాలీవుడ్ సుందరాంగి!

మంగళవారం, 7 జూన్ 2016 (10:02 IST)
ఓ సినిమా హిట్ అయితే దానికి సీక్వల్ తీసి మరో హిట్ తమ ఖాతాలో వేసుకోవాలని దర్శక నిర్మాతలు తాపత్రయపడుతుంటారు. మొదటి సినిమాతో పోలిస్తే సీక్వెల్‌ని మరింత కలర్‌ఫుల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌తో బిజీ బిజీగా ఉంటూ, వెండితెర మీద తన నటనతో హోయలొలికించిన విద్యాబాలన్ మరోసారి తన అందచందాలతో అభిమానులను కనువిందుచేయడానికి సిద్ధమవుతోంది. గతంలో క్లాస్ హీరోయిన్ ముద్రను ''ఇష్కియా'' సినిమాతో తుడిచేసుకుంది. ఆ తర్వాత సిల్క్ స్మిత జీవితకథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ''డర్టీ పిక్చర్''. ఈ చిత్రంతో తనలో ఉన్న గ్లామర్ రసాన్ని సెక్సీగా ఒలికించడం మొదలుపెట్టింది. 
 
కెరియర్ స్పీడ్ మీదున్నప్పుడే పెళ్లి చేసుకుని, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా కొన్ని ప్రయోగాత్మ సినిమాలు చేయడం, అవి కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో విద్యాబాలన్ అవకాశాలు కరువయ్యాయి. కాగా ఇప్పుడు ''బేగం జాన్'' అనే సినిమాలో వేశ్యగా నటిస్తున్న విద్యాబాలన్ ఆ సినిమాతో పాటు ఇప్పుడు మరో సెక్సీ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 
 
ఆ సినిమా ఏంటో తెలుసా.. ''ఇష్కియా''కు మూడో సీక్వల్. రెండో సీక్వెల్లో మాధురి దీక్షిత్, హుమా ఖురేషిలు నటించగా ఇప్పుడు మూడో సీక్వెల్‌లో తిరిగి విద్యాబాలన్‌ని నటింపజేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. మొదటి పార్ట్‌లో కన్నా కూడా ఈ అమ్మడు సెక్సీ రోల్‌లో దుమ్ముదులపనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోసారి విద్యా ఇష్కియాతో తన అందాలకు పని చెప్పనుందన్న మాట.

వెబ్దునియా పై చదవండి