రష్మిక మందన్న బర్త్ డే తర్వాత రోజే సోషల్ మీడియాలో విజయ్, రష్మిక ఫొటోలను పోస్ట్ చేశారు. ఇద్దరు ఒమన్ వెళ్లినట్టు ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఓమన్ షేక్ డ్రెస్ లో విజయ్ నడుచుకుంటూ, గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించగా, రష్మిక అక్కడే సముద్ర ఒడ్డున కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇద్దరూ కలిసి కాకుండా విడివిడిగా వున్నట్లు భ్రమించేలా ఫొటోలో ప్రేమ్ లో పెట్టి విజయ్ టీమ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.