కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన విశాల్ హీరోగా, ప్రొడ్సూసర్‌గా కొనసాగుతూనే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు చేపట్టారు. ఆయనకు హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి అనీషారెడ్డితో పెళ్లి ఫిక్స్ అయ్యి, మార్చి 10న ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.
ముందుగా వీరి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టింది అనీషానే, 2018లో తన సోషల్ మీడియా పేజీలో ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేయగా, ఆపై హీరో విశాల్ తన అభిమానులకు వెల్లడించాడు. ఇక అనీషా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలతో పాటు నిశ్చితార్థం ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఆమె తన సోషల్ మీడియా పేజీ నుంచి ఆ ఫోటోలన్నీ తొలగించింది.
విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు రావడంతో వారు పెళ్లి రద్దు చేసుకున్నట్లు, అందుకే ఫోటోలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే విశాల్ లేదా అనీషా ఎవరో ఒకరు స్పందించాలి.