ఆడై అమలాపాల్‌తో మళ్లీ తమిళ రాక్షసుడు హీరో... జెర్సీ రీమేక్‌లో? (video)

మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:46 IST)
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన ''జెర్సీ'' హిట్టైన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ప్పటికే 'జెర్సీ'ని హిందీలోకి తీసుకెళ్లేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే తెరకెక్కించనున్నారని తెలిసింది. అలాగే, ఈ సినిమాకు వరుణ్ ధావన్, షాహీద్ కపూర్‌లలో ఒకరిని తీసుకోవాలని ఈ ఇద్దరు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఇదే సినిమాను తమిళంలోనూ తీయాలని సురేష్ ప్రొడక్షన్స్ భావిస్తోందట. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా మారబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్‌.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం. విష్ణు స్వతహాగా క్రికెట్ ప్లేయర్ కావడంతోనే రానా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆడై ఫేమ్ అమలా పాల్‌ను తీసుకుంటున్నారట. ఇందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విష్ణు విశాల్, అమలాపాల్ తమిళ రాక్షసుడు సినిమాలో జంటగా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని కోలీవుడ్ టాక్. ఇంకా తమిళ జెర్సీ రీమేక్ ద్వారా ఈ జంటకు మంచి గుర్తింపు వస్తుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు