నన్నలా ఇంప్రెస్ చేస్తే నేను దానికి రెడీ అంటున్న త్రిష

గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:48 IST)
డేటింగ్ అంటే ఇప్పుడు పెద్ద తప్పేమీ కాదన్నది చాలామంది అభిప్రాయం. ఇక సినీ ఇండస్ట్రీలో ఇది కామన్ అంటుంటారు. తాజాగా త్రిష ఏకంగా డేటింగ్ ఆఫర్‌ను అభిమానులకే ఇచ్చింది. 
 
అభిమానులు ఎవరైనా 500 పదాలతో ఒక వ్యాసం రాసి అందులో ఉన్న అర్థాలను అర్థమయ్యేటట్లుగా వివరించి తనను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా వారితో డేటింగ్ చేయడానికి సిద్థమంటోందట త్రిష. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.
 
దీంతో అభిమానులందరూ సిద్థమైపోయారు. వ్యాసాలు రాయడం ప్రారంభించేశారట. అయితే కొంతమంది అభిమానులు మాత్రం త్రిష చెప్పేదంతా అబద్ధాలంటూ సందేశాలు పంపుతున్నారట. గతంలో చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం చేసుకుని పెళ్ళి వద్దనుకుంది. త్రిష ఏది చెప్పినా అందులో అబద్ధాలు వుంటాయనీ, ఇది కూడా అంతేనంటున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు