నటుడు గోపీచంద్ సినిమాలు వరుసగా చేస్తున్నాడు. 'ఆక్సిజన్' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ ఆగిపోయింది. గతంలో కూడా జ్యోతికృష్ణ సారధ్యంలో తరుణ్‌తో చేసిన సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని.. మరలా ఆయన చేస్తున్న ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనేందుకు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.
దర్శకుడికి.. హీరోకు మధ్య సమన్వయం సరిగ్గా కుదరక ఆపేసినట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందే గోపీచంద్, నయనతార కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందింది. ఆ చిత్రమూ నిర్మాత వేరే వ్యాపారంలో వుంటూ.. ఆపేశాడు. దాంతో.. రెండు చిత్రాలు ఆగిపోయినట్లయింది. అయితే.. ఇటీవలే మరలా ఆ సినిమాను ముందుకు తెస్తున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు దానికి గురించి సరైన వివరణే చిత్ర యూనిట్‌కు తెలియదట. సో.. ఇలా జరుగతుండగా.. ప్రస్తుతం గోపీచంద్.. సంపత్‌నంది దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రం సెట్‌పై ఉంది.