ఇదిలా వుండగా, టిల్లు స్వేర్ లో టిల్లు చిత్రానికి మించి సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఇప్పటి కల్చర్ పేరుతో రకరకాలుగా కొత్త పోకడలు తీసుకురావడం, కోట్లాదిమంది మైండ్ లో కొత్త కాన్సెప్ట్ లు ఎక్కించడం ఎంతవరకు సబబు? అనేది ప్రశ్నగా మారింది. మనకు తెలీకుండా బయట చాలా ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు సీక్వెల్ లో హీరో, దర్శకుడు చూపించబోతున్నారు. పాష్ కల్చర్ పేరుతో లేడీస్ ఎక్కువగా ఎక్సపోజ్ చేయడం, బూతులు మాట్లాడటం, బాష కూడా విదేశీ కల్చర్ కు అనుగుణం గా ఉండటం అనేవి కేవలం అక్కడివారిని బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారని తరచూ దర్శక నిర్మాతలు చెపుతున్నారు. మరి ఈ పోకడ ఎంత దూరం పోతుందే ప్రేక్షకులే తీర్పు చెప్పాలి.