అర్ధనగ్నానికి మించిన అవతారంలో కనిపిస్తా: నమిత

నమిత వచ్చే కొత్త సంవత్సరం 2010 నుంచి కొత్త అవతారం ఎత్తుతానంటోంది. ఇప్పటివరకూ కొన్ని సినిమాల్లో అర్థనగ్నమైన సన్నివేశాలలో నటించి విసిగిపోయానని చెపుతోంది. ఈ స్థానంలో తను అర్థనగ్నానికి మించిన కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు ప్రకటించింది. అర్థనగ్నానికి మించిన అవతారం అంటే ఇంకేదో అనుకునేరు... మరేం లేదు.. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోకి మళ్లబోతున్నట్లు నమిత చెపుతోంది. 

వీలుదొరికినపుడల్లా గుళ్లూ గోపురాలను సందర్శిస్తానంటోంది. పూర్తి సంప్రాదాయ మహిళగా కాలం గడుపుతానంటోంది. మరీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటే అభిమానులు తట్టుకుంటారో లేదో నమితా... కాస్త ఆలోచించు.

అన్నట్లు ఆ మధ్య యూ ట్యూబ్‌లో నమితకు సంబంధించిన ముప్పావు వంతు అర్థనగ్న దృశ్యాలు దర్శనమిచ్చాయనీ, దాంతో నెటిజన్లు ఒహటే ఎగబడ్డారని వార్తలు వచ్చాయి. ఆధ్యాత్మిక అవతారానికి ముందు ఇదేమైనా ఫినిషింగ్ టచ్ ఏమో...!!

వెబ్దునియా పై చదవండి