"జులాయి"ని ఈగ తరిమింది... ఇప్పుడేమో డేవిడ్ బిల్లా హీరోయిన్ స్కిన్ షో వెంటాడుతోంది

బుధవారం, 27 జూన్ 2012 (13:30 IST)
భారీ అంచనాలతో తెరకెక్కించిన అల్లు అర్జున్ జులాయి చిత్రం విడుదలను తొలుత జులై ప్రధమార్థంలో అనుకున్నారు. ఐతే జులై 6వ తారీఖును రాజమౌళి ఈగ చిత్రం విడుదలవుతుండటంతో జులాయి చిత్రం విడుదలను కాస్త వెనక్కి నెట్టేశారు. 

ఈగ తర్వాత విడుదల చేద్దామని అనుకుంటుంటే... ఇప్పుడేమో జులాయిని ఇద్దరు సెక్సీ భామలు తరుముకొస్తున్నారట. వాళ్లెవరయ్యా అంటే.... డేవిడ్ బిల్లా చిత్రంలోని పార్వతి ఒమ్నకుట్టన్, బ్రునా అబ్దుల్లా. ఈ భామల స్కిన్ షో దెబ్బకు ఎవరైనా గింగరాలు తిరిగి పడిపోవాల్సిందేనట. ఇక వాళ్ల ముందు జులాయి నిలబడగలడా అని టాలీవుడ్ ఫిలిమ్ జనం ప్రశ్నించుకుంటున్నారు.

ఐతే వాళ్లిద్దరు మితిమీరిపోయి చూపించిన అర్థనగ్న దృశ్యాలకు సెన్సార్ కత్తెర వేసిందట. లేకపోతే జులాయిని పండగ చేసుకునేవారంటున్నారు. మరి డేవిడ్ బిల్లా దెబ్బకు జులాయి పారిపోతాడో... బిల్లానే తరిమి కొడతాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి