నా రూమ్‌లో ఎవరో ఉన్నారు.. చూసి ఇదేమిటని అన్నా.. అంతే: లక్ష్మీరాయ్

గురువారం, 21 జూన్ 2012 (12:56 IST)
అధినాయకుడు సినిమాలో బాలకృష్ణ సరసన ఆడిపాడిన భామ లక్ష్మీరాయ్‌. ఆ సినిమా స్పందన గురించి చెబుతూ... స్టార్‌ హీరో పక్కన నటించాను కాబట్టే ప్రేక్షకులకు దగ్గర కాగలిగాను. నేను చేసిన డాన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేశారంటోంది.

ఇదిలా ఉంటే... ఇటీవలే ఆమె విక్రమ్‌తో నటిస్తున్న 'తాండవం' సినిమా షూటింగ్‌ కోసం లండన్‌ వెళ్ళింది. అక్కడ హోటల్‌ రూమ్‌ సరిగా లేదని హడావుడి చేసింది. ఇలాగైతే షూటింగ్‌కు రానని తెగేసి చెప్పేసింది కూడా. దీంతో దర్శకుడు విజయ్‌ తనకు ప్రత్యేకంగా గదిని కేటాయించాడట.

ఎందుకింత హడావుడి చేశారని అడిగితే.. నేనేం నిర్మాతల్ని ఇబ్బందిపెట్టలేదు. నాకు కేటాయించిన రూమ్‌లో ఎవరో ఉన్నారు. ఏమిటని నిలదీశాను. దానికి సరైన సమాధానం మేనేజర్ల దగ్గర నుంచి రాలేదు. ఇందులో అడగడం తప్పేమిటి? దానికి ఏవేవో ఊహించుకుని రాసేస్తున్నారంటూ.. అసలు సంగతి చెప్పింది.

వెబ్దునియా పై చదవండి