రిచా భారీ ఎద అందాలతో ఆఫర్ మిస్.. స్లిమ్ అందాలతో తాప్సీ గెట్

గురువారం, 17 మే 2012 (14:52 IST)
తమిళ తంబీలు మనసు మార్చుకున్నారా..? భారీ ఎద అందాలున్న భామలుంటేనే సినిమాలు చూసే తమిళ తంబీలు తమ ట్రెండ్‌ను మార్చుకున్నట్లే కనబడుతోందంటున్నారు కోలీవుడ్ జనం. అదేంటయా..? ఖుష్బూ, నగ్మా మొదలుకొని నమిత వరకూ ఎద అందాలు పుష్కలంగా ఉంటేనే ఆదరించారు.. అలాంటిది ఈ ట్విస్ట్ ఏమిటీ.. అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు కథ.

తాజాగా అజిత్ నటించే ఓ సినిమాకు తొలుత రిచా గంగోపాధ్యాయను అనుకున్నారట దర్శకులు. ఫోటో షూట్ కూడా చేశారట. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆమె ప్లేస్‌లో తాప్సీని తీసుకుంటున్నట్లు ప్రకటించేశారట సదరు దర్శకనిర్మాతలు.

ఏమైందయా.. రిచాను కాదని తాప్సిని ఎందుకు తీసుకున్నారని అడిగితే... రిచా ఎద అందాలు మరీ మితిమీరినట్లు కనబడటంతో ఆమెను కాదనుకున్నట్లు చెప్పుకొచ్చాడట సదరు డైరెక్టర్. అదేసమయంలో తాప్సీ ఎద అందాలను స్లిమ్‌గా చూడముచ్చటగా మెయిన్‌టైన్ చేయడమే కాకుండా మితిమీరినట్లు లేవనీ, అందువల్లనే ఆమెకు ఆఫర్ కట్టబెడుతున్నట్లు చెప్పుకొచ్చాడట ఆయన.

ఏమి ఇండస్ట్రీయో ఏంటో.. ఎక్స్‌పోజింగ్ చేయకపోతే ఏమీ చూపట్లేదు.. అందుకే ఆఫర్లు లేవంటారు.. చూపించేందుకు కష్టపడి మెయిన్‌టైన్ చేస్తే... అబ్బో ఎక్కువైందంటారు.. ప్చ్.. అని నిట్టూరుస్తోందట రిచా.

వెబ్దునియా పై చదవండి