వాడుకోవడంలో వర్మ నంబర్ వన్ : అంజనా సుఖానీ

సోమవారం, 14 మే 2012 (13:48 IST)
నటీనటులను తనకు ఇష్టమొచ్చినట్టుగా ఉపయోగించుకోవడంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నంబర్ వన్ అని యువ నటి అంజనా సుఖాని అంటోంది. నటీనటులను వ్యాపారపరంగా ఉపయోగించుకోవడంలో చాలా పక్షపాతం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

'డిపార్ట్‌మెంట్‌' సినిమా షూటింగ్‌ గురించి పెద్దగా పబ్లిసిటీ ఇవ్వకపోగా, ఐటంసాంగ్‌ నథాలియా కౌర్‌ని ప్రమోట్‌ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్‌లోనూ, వెబ్‌సైట్ల వారికి ఛానళ్ళవారికి ఆమె గురించి పబ్లిసిటీ ఇస్తున్నాడని వర్మపై అలిగింది. అయినా తనదైన శైలిలో.. ఆమెను కన్‌వీనియన్స్‌ చేయడానికి ట్రై చేశాడట వర్మ.

ఐతే బాగా అలిగిన అంజనా... నటిగా గుర్తింపు లేనప్పుడు ఐటంగాళ్‌తోనే సినిమా చేసుకోండని చెప్పిందట. దీనికి వర్మ ఏమంటాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి