పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం చాలా కష్టమని చెప్పేసింది మీరా చోప్రా. ఇందుకు కారణం ఆయన ఫ్యాన్సేనట. బంగారం మూవీ చేసేటప్పుడు తనకు ఎదురైన అనుభవాల కారణంతోనే ఈ అభిప్రాయానికి వచ్చేసింది మీరా చోప్రా. ప్రస్తుతం 1920 లండన్ అనే హిందీ హారర్ మూవీలో నటిస్తున్న మీరా చోప్రా... బంగారం సినిమా షూటింగ్ గురించి గుర్తు చేసుకుంది.
బంగారం దర్శకుడు తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ ప్లాన్ చేశాడు. ఏపీలో పవన్‌తో షూటింగ్ చాలా కష్టం. అయితే పొల్లాచ్చిలో హోటల్స్ ఉండవు. అందుకే తామంతా ఓ చిన్న గెస్ట్ హౌస్‌లో బస చేశాం. పవన్ కల్యాణ్ వచ్చారని తెలిసి పదివేల మంది గెస్ట్ హౌజ్ చుట్టూ చేరిపోయారని.. దీంతో పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు కనీసం కాలు కూడా బయటపెట్టలేకపోయారంటూ మీరా చోప్రా వెల్లడించింది. న్యూయార్క్‌లో పెరిగిన తనకు భారత్‌లో స్టార్ హీరోల్ని దేవుళ్లుగా కొలుస్తారని తెలుసు కానీ, దక్షిణాదికి వచ్చినప్పుడే దాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చోప్రా తెలిపింది.