తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

సెల్వి

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (13:21 IST)
Accident
హైదరాబాద్‌, జనగాంలో పార్క్ చేసిన 8 బైకులను 'తాగిన' మైకంలో బండిన కారు డ్రైవర్ ఢీకొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
సూర్యారెడ్డి అనే స్థానిక జర్నలిస్ట్ ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. జనగాం లోని సూర్యాపేట రోడ్డులో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎనిమిది వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. 
 
ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పట్టపగలు జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. కారులో నలుగురు మధ్య వయస్కులైన ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

A speeding car lost control and rammed into 8 bikes on #Suryapet Road in #Jangaon. Causing a woman suffered grievous injuries, while 2 others escaped with minor injuries. The terrifying moment was captured on #CCTV.
The #CarAccident raised serious #RoadSafety concerns. Suspects… pic.twitter.com/hnQ21KfymI

— Surya Reddy (@jsuryareddy) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు