గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

సెల్వి

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (14:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశాడు. ఈ క్రమంలో ప్రసవ వేదన భరించలేక ఆ చిట్టితల్లి మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరు పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. గర్భం చేసింది ఎవరో కూడా తెలియకపోవడంతో ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 16 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 
 
బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపలేదు. ఈ క్రమంలో ఆమెను ఇంట్లోనే ఉంచారు. అయితే శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో ఆదివారం బాలికకు ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలో వెంటనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిబిడ్డలను అంబులెన్సులో తిరుపతికి తరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక గర్భానికి కారకులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు