మరాఠా నటి సోనాలి కులకర్ణి తండ్రి కత్తిపోటుకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దుండగుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అతన్ని పట్టుకునేందుకు సోనాలి తండ్రి ప్రయత్నించగా, అతనిపై దుండగుడు దాడిచేయడంతో ఈ కత్తిపోటు గాయం తగిలింది.
మాహారాష్ట్రలోని పుణెలో పింప్రి చించ్ వాద్లో నివాసముంటున్న సోనాలీ ఇంట్లోకి మంగళవారం ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఒక ఫేక్ గన్, కత్తితోపాటు.. టెర్రస్ పై నుంచి నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. వెంటనే అక్కడున్న పనిమనిషిని గమనించిన ఆ నిందితుడు.. కత్తితో ఆమెను బెదిరించి.. తన వెనుక పోలీసులు ఉన్నారని.. కాబట్టి చప్పుడు చేయకుండా.. ఎక్కడా దాక్కోవాలో చెప్పమని అడిగాడు.