భువనేశ్వర్‌కు పితృవియోగం.. కేన్సర్‌తో బాధపడుతూ మృతి

శుక్రవారం, 21 మే 2021 (09:03 IST)
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన కిరణ్ పాల్ సింగ్... శుక్రవారం తన నివాసంలోనే కన్నుమూశారు. ఈయనకు ఎయిమ్స్‌లో చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండాపోయింది. 
 
భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ వయసు 63 సంవత్సరాలు. ఈయన కేన్సర్‍‌తో అనేక ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో పని చేస్తూ వచ్చిన కిరణ్ పాల్ సింగ్... వీఆర్ఎస్ తీసుకుని కుటుంబంతో కలిసి మీరట్లో నివసిస్తున్నారు. 
 
చివరి క్షణాల్లో భువనేశ్వర్ కుమార్, కుమార్తె రేఖా, భార్య ఇంద్రేష్ దేవి ఉన్నారు. చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కిరణ్ పాల్ అనేక ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నాడు. అతనికి కీమో థెరపీ కూడా జరిగింది. కానీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదని వైద్యులు తెలిపారు. దీంతో మీరట్‌లోని గంగనగర్ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి తిరిగి తీసుకువచ్చారు అక్కడ అతను మరణించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు