మా నాన్నను బతికించిందదేనన్న కోటయ్య కుమార్తె, దేవుడా ఈ పాపమెరిదన్న డాక్టర్

శనివారం, 22 మే 2021 (22:19 IST)
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం సమీపంలోని ముత్తుకూరులో నిన్న కరోనాను తగ్గించేందుకు ఆయుర్వేద మందును ఆనందయ్య పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక వ్యక్తి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి కిందపడిపోయాడు. పడుకొని నీరసంగా గాలి పీల్చలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తికి రెండు చుక్కలు అతని కంట్లో మందు పోశారు.
 
అంతే సరిగ్గా పదే  పదినిమిషాల్లో లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి కోటయ్య. రిటైర్డ్ హెడ్ మాస్టర్. మందు పోసుకోకముందు..మందు పోసుకున్న తరువాత అంటూ ప్రచారం బాగానే కోటయ్య గురించి సాగింది. అంతే కాదు ఆ మందు పోసిన తరువాత కోటయ్యకు ఆక్సిజన్ లెవల్స్ కూడా పెరిగింది. 
 
దీంతో ఆనందయ్య శిష్యులు కోటయ్య దగ్గరకు వచ్చి మంచి ఆహారం తీసుకో..నీకు నెగిటివ్ వచ్చేసింది. ఏం కాదు అన్నారు. అయితే ఈరోజు ఉదయం మళ్ళీ ఆసుపత్రికి వచ్చారంట కోటయ్య. ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతోందని వైద్యులు చెప్పారట. ఇది కాస్త మళ్ళీ ప్రచారం మొదలైంది.
 
కానీ కోటయ్య కూతురు జరిగిన విషయాన్ని నిర్థారించారు. పాజిటివ్ పోయి నెగిటివ్ వచ్చేసింది. ఆ మందు వల్లే నా తండ్రి బతికాడు. కేవలం నీరసం మాత్రమే. బాగా నీరసించిపోయి ఉంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం. శ్వాస సంబంధిత వ్యాధి ఏ మాత్రం మా నాన్నకు లేదు. ఆక్సిజన్ కూడా పెట్టుకోలేదు. బాగా ఉన్నాడు. నీరసంగా ఉంటేనే తీసుకువచ్చాము.
 
గుర్తుపెట్టుకోండి.. ఎవరికైనా చెప్పండి.. ఆనందయ్య మందే బాగా పనిచేసింది. ఆ మందు వల్లే నా తండ్రి బతికి ఉన్నాడు. ఇది నిజమంటూ తేల్చేసింది కోటయ్య కూతురు. ఐతే ఆనందయ్యకు కళ్లలో చీము వస్తుందంటూ వైద్యులు చెపుతున్నారు. మరి ఆనందయ్య మందు ప్రభావమా లేక మరొకటా అనేది తేలాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు