పాతికేళ్ళ భారతీయుడు, 'టార్చి లైట్‌' కమల్‌కి మే నెల బాగా గుర్తిండిపోతుంది కదూ

సోమవారం, 10 మే 2021 (18:41 IST)
kajal, kamal, sankar
కమల్ హాసన్ కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’. తమిళంలో ‘ఇండియన్’గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు’గా విడుదలైంది. 1996 మే 9న విడుదలైన ఈ చిత్రం ఆదివారానికి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఒక స్వాంతంత్ర సమరయోధుడు దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఏం చేశాడు అనేది ‘భారతీయుడు’ కథాంశం. 
 
లంచగొండితనం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. `ఇండియ‌న్‌2` త‌మిళంలో తెలుగులో `భారతీయుడు-2గా రానున్న సీక్వెల్‌లో కూడా కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూట్ 2019లో ప్రారంభ‌మైంది. కాజ‌ల్‌కూడా హాజ‌ర‌యింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు కూడా భాగస్వామ్యం అవడం విశేషం. మ‌రి ఇది ఎప్పుడు పూర్త‌వుతుందో చూడాలి.

కొస‌మెరుపు ఏమంటే, అవినీతిని నిర్మూలిస్తానంటూ క‌మ‌ల్‌హాస‌న్ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌డం జ‌రిగింది. ఓటుకు డ‌బ్బులు ఇవ్వ‌కుండా నిజాయితీగా ఓటింగ్ వేయించుకుంటానంటూ ఆయ‌న ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎవ‌రికీ అర్థ‌మ‌యిన‌ట్లు లేదు. అందుకే  ఆయ‌న మాట ఎవ‌రూ విన‌క‌పోవ‌డం విచిత్ర‌మేగ‌దా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు