స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రను పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం కథ కొనసాగనుంది. అయితే, ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై హీరో పాటు దర్శక నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. పెర్ఫెక్ట్ ప్లానింగుతో ఆయన ఈ సినిమా షూటింగును పూర్తి చేస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన వీడియోను బట్టి, ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయనే విషయం అందరికీ అర్థమైపోయింది. పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే 39 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పుకుంటున్నారు.