ఏదో కొద్దిసేపు వుంటుందనుకున్న ఈ వేడుక దాదాపు గంటపట్టింది. ఈలోగా ట్రాఫిక్‌ను బిడ్జ్రి కిందనుంచి ఇన్ ఆర్‌బిట్ మాల్‌కు మళ్ళించారు. కాగా, ఈ బాణాసంచాను కాల్చిన ఆయన అభిమానులపై కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పేల్చారంటూ వీరిపై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్ పేరుతో ఫైర్ క్రాకర్స్‌ని ఈ వేడుకలో కాల్చారు. జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశాంత్, సంతోష్‌పై కేసు నమోదు చేశారు. పబ్లిక్ కి అంతరాయం కలిగించారు కాబట్టి వీరిపై ఐపిసి 290, ఐపిసి 336 మరియు ఐపిసి 188 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు