అల్లు అర్జున్‌కు ఐకాన్ స్టార్ అనేది నేను పెట్టలేదు. ఆయనకు ఆయనే పెట్టుకున్నాడని దిల్‌రాజు తేల్చిచెప్పారు. అల్లు అర్జున్‌ను అందరూ స్టయిలిష్ స్టార్ అంటుంటారు. ఆ బిరుదుకూడా ఆర్య సినిమా తర్వాతే వచ్చింది. ఇప్పుడు ఈ విషయం రావడానికి ఓ సందర్భం వుంది. దిల్‌రాజు అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే సినిమా తీయబోతున్నాడు. వకీల్ సాబ్ కు ముందే ఈ సినిమా సెట్‌పైకి వెళ్ళాల్సింది. కానీ షడెన్‌గా పవన్ కళ్యాణ్ కు పింక్ కథ సెట్‌కావడంతో వకీల్‌సాబ్‌ముందుకు వచ్చింది.
వకీల్‌సాబ్ సినిమాకు ముందే ఐకాన్ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ కొన్ని కథలు ముందు వెనుక అవుతుంటాయి కనుక ఇప్పుడు ఐకాన్‌కు టైం వచ్చింది. ఈ సందర్భంగా మీ ఐకాన్ స్టార్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు దిల్‌రాజు బదులిస్తూ. ఐకాన్ అనేది మనం పెట్టింది కాదు. ఆయన పెట్టుకుంది. అంటూ సమాధానమిచ్చారు. దర్శకడు వేణుశ్రీరామ్ చెప్పిన ఐకాన్ కథ మనసుకు నచ్చిందని దిల్‌రాజు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, హీరోలకు ప్రశంసలు, బిరుదులు మామూలే. అయితే బిరుదులు కొన్ని సేవా సంస్థలు, కళాకారులను ప్రోత్సహించడానికి ఇస్తుంటారు. వారు చేసిన సేవలకు తగినట్లుగా బిరుదులు ఇచ్చి సత్కరిస్తుంటారు. సినిమా హీరోలకు అభిమానులు ఇచ్చిన బిరుదులు చాలామంది హీరోలకు వున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు కూడా స్టయిలిస్ స్టార్ అనే బిరుదుకూడా అలా వచ్చిందే. ఆర్య సినిమా చేశాక దర్శకుడు సుకుమార్ ఆయనకు ఆ బిరుదు వచ్చేలా చేశారు. అందుకు తగినవిధంగానే అల్లు అర్జున్ నటన, యాక్షన్, డాన్స్ వుండేవి. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అనే బిరుదు ఆ మధ్య పుష్ప ఆడియో వేడుకలో సుకుమార్ ఐకాన్ స్టార్ అనే పదం వాడారు. అది విన్న వెంటనే అల్లు అర్జున్‌కూడా మీ సినిమా టైంలోనే స్టయిలిష్ స్టార్ వచ్చింది. ఇప్పుడు ఐకాన్ అంటున్నారు. దానికి తగిన అర్హత వుందోలేదోకానీ ఆ పదం చాలా బాగుందని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అని అభిమానులు పిలవడం మొదలు పెట్టారు.