సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా సమంత రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మరో సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఘనత అందుకుంది. ఆమే.. చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్. సమంత 3 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టినప్పటికీ 2.9 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న త్రిష వారం లోపే.. 30 లక్షల మార్కును అందుకుంది.
ఐతే సమంతతో పోలిక పెట్టకుండా చూస్తే త్రిష సాధించింది గ్రేట్ అచీవ్మెంటే. సౌత్ ఇండియాలో 3 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టిన ఫిలిం సెలబ్రెటీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే. ఆయన ఫాలోవర్ల సంఖ్య 3.3 మిలియన్లను దాటింది. మహేష్ బాబు.ఫాలోవర్ల సంఖ్య 2.6 మిలియన్లుండగా.. రాజమౌళి ఫాలోవర్లు 2.5 మిలియన్ల మార్కుకు చేరువలో ఉన్నాడు.