సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన భారీ చిత్రం మహర్షి. బ్లాక్ బష్టర్ మూవీ భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ నటించిన సినిమా కావడం... ఇది మహేష్ కి 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తితో ఎదురుచూసిన మహర్షి సినిమా ఈ రోజు మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
ఈ సినిమా చూడాడానికి 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొదటగా చెప్పుకోవాల్సింది. మహేష్ బాబు. ఇందులో మహేష్ బాబు స్టూడెంట్‌గా నవ్వించారు.. బిజినెస్ మ్యాన్‌గా ఇన్‌స్పిరేషన్ కలిగించారు. రైతుగా ఆలోచింపచేసారు. ఇలా త్రీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించారు. గత చిత్రాల కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించారు.
పూజా హేగ్డే.. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. కాలేజీ సీన్స్‌లో అయితే.. మన పక్కంటి అమ్మాయిలా నటించి యూత్‌ని బాగా ఆకట్టుకున్నారు. మహేష్, పూజా మధ్య చిత్రీకరించిన సీన్స్‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
అల్లరి నరేష్.. ఈ చిత్రంలో మహేష్ ఫ్రెండ్‌గా కీలక పాత్ర పోషించారు. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి చదువుకునే అబ్బాయి పాత్రలో మనకు కావాల్సినంత వినోదాన్ని పండించాడు. ఇక సెకండాఫ్‌లో అయితే.. అల్లరి నరేష్ అద్భుతంగా నటించి కంటతడి పెట్టించాడు.
రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ప్రతి పాట ఆకట్టుకుంది. ముఖ్యంగా పదర పదర సాంగ్, చోటి చోటి బేటిన్ సాంగ్, నువ్వే సమస్తం... ఇలా ఒకటేమిటి అన్ని పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరింది. ఆ సీన్స్ అంత బాగా వచ్చాయి అంటే దానికి దేవిశ్రీ అందించిన మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పచ్చు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మూడు సంవత్సరాలు వెయిట్ చేసి ఈ సినిమా తీసారు. ఈ సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్... ఇలా టెక్నకల్ టీమ్ అంతా చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేసారు.