కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ అవార్డులను శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫోటో' ఎంపికైంది. అలాగే, జాతీయ ఉత్తమ నటులుగా హీరో సూర్య, అజయ్ దేవగణ్‌లు సంయుక్తంగా ఎంపికయ్యారు.
ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో నాట్యం, ఉత్తమ సంగీత చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి.
ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
జాతీయ అవార్డుల విజేతలు వీరే
ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్ దేవ్‌గణ్( తానాజీ)
ఉత్తమ నటి అపర్ణ బాలమురళి(సూరారై పోట్రు)
ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు( సుధాకొంగర)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం)