సింగర్ సునీతకు షాకిచ్చిన బుడ్డోడు.. ఏం చెప్పాడో తెలుసా?

శనివారం, 29 మే 2021 (19:50 IST)
టాలీవుడ్ సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే. తన రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా మారింది సునీత. ఇక ఈ మధ్య కోవిడ్ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతూ వస్తోంది. ప్రస్తుతం బుల్లితెరలో కూడా చేస్తుంది. 
 
జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో జడ్జ్‌గా చేస్తుంది. తనతో పాటు నటి రేణు దేశాయ్, ఎస్ వి కృష్ణారెడ్డి కూడా జడ్జ్‌గా చేస్తున్నారు. ఇదిలా ఉంటే సునీతకు ఓ బుడ్డోడు నీ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ షాక్ ఇచ్చాడు.
 
ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది చిచ్చర పిడుగులు తమ పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంటారు. అన్ని రకాల నవరసాలను అందిస్తారు. అంతేకాకుండా వాళ్లు చేసే ఎమోషనల్ స్కిట్ లతో కూడా ప్రేక్షకులను, జడ్జీలను బాగా భావోద్వేగానికి గురి చేస్తారు. 
 
ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ప్రోమో విడుదల కాగా అందులో ఓ బుడ్డోడు మన్మథుడు సినిమాలో ఓ స్పూఫ్‌తో స్కిట్ చేశాడు. ఇక అందులో ఎంతో ఫన్నీగా చేస్తూ నాగార్జున పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు. ఆ స్కిట్ తర్వాత సునీత ఆ బుడ్డోడిని నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలో అని ప్రశ్నించింది. 
 
వెంటనే ఆ బుడ్డోడు మీలా ఉండాలంటూ సునీత కి షాక్ ఇచ్చాడు. ఇక అక్కడున్నవారంతా నవ్వుకోగా.. రేణు దేశాయ్ ఆ బుడ్డోడితో ఓ డాన్స్ స్టెప్ వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు