ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఈ సినిమా సెట్లో గొడవ జరిగిందనే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే... ఈ చిత్రానికి ప్రసన్న రైటర్‌గా వర్క్ చేస్తున్నాడు.
నక్కిన త్రినాథరావు సినిమాలకు ప్రసస్న రైటర్. అయితే... ఈ రైటర్ సెట్లో అన్నీ తనే అయి చూసుకుంటాడట. అది డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, రైటర్ ప్రసన్నకు మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్. ఇటీవల సెట్లో కెమెరామెన్ విజయ్‌కి ప్రసన్న కలర్ ఎలా ఉండాలో ఏదో చెప్పబోయాడట. అంతే... కెమెరామెన్ విజయ్‌కి బాగా కోపం వచ్చిందట. ఏదైనా చెప్పాలంటే డైరెక్టర్ చెప్పాలి కానీ.. రైటర్ చెప్పడం ఏంటి అంటూ కాస్త పెద్ద గొడవే జరిగిందట. అయితే.. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు వచ్చి కూల్ చేసాడట. అదీ.. సంగతి.